తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. `అనగనగా ఓ ధీరుడు` సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక తాజాగా తన గొప్ప మనసుని చాటుకొని అందరి ప్రశంసలు అందుకుంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. `అనగనగా ఓ ధీరుడు` సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఈమె తన కెరీర్ లో ఉన్న ఎన్నో టీవీ షో లకు ఓ టీ టీ షో లకు హోస్ట్ గా వ్యవహరించింది. ఆ క్రమంలోనే గత కొన్నాళ్ల నుంచి టీచ్ ఫర్ చేంజ్ ను 2014లో మంచు లక్ష్మీ మరియు బ్రహ్మచార్ చైతన్యచే స్థాపించబడినది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, లక్నో మరియు చెన్నై అంతటా ఈ సంస్థ మరింత సాగుతుంది. అయితే ఇప్పుడు మరో 4 నగరాలు – బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం – భాగంలో ఉన్నాయి. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి.
భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ ఇప్పుడు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని తన గొప్ప మనసును చాటుకుంది. అయితే తాను పెట్టిన టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ద్వారా ఈ పాఠశాలలను అభివృద్ది చేస్తానని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే టీచ్ ఫర్ చేంజ్ లక్ష్యమని ఆమె పేర్కొన్నది. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసారు. అనంతరం స్కూళ్ల దత్తత విషయం గురించి మాట్లాడి ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వెనుకబడిన జిల్లాలోకి వెళ్లి పాఠశాలల అబివృద్ది కోసం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఉందని.. దాని ఆద్వర్యంలో నడిపిస్తానని తెలిపారు. అయితే గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ది చేసాను. ఈ సంవత్సరం కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుందామని నేను ముందుకు వచ్చాను. అలాగే గద్వాల్ జిల్లాలో నేను దత్తత తీసుకున్న 30 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాస్ లు మౌలిక వసతులు కల్పిస్తామని లక్ష్మీ తెలిపారు. ఈ మెుత్తం పనులు అగస్టు లోపే పనులు పూర్తయ్యే విదంగా ప్రణాళిక సిద్దం చేస్తాం అని కోరారు. నేను మాటలు చేప్పే రకం కాదని.. చేసి చూపిస్తానని.. తెలియజేసింది. ఇంతకుముందు యాదాద్రి జిల్లాలో అభివృద్ది చేసిన పాఠశాలల గురించి ప్రస్తావిస్తున్నాను అని చెప్పింది. దీంతో కలెక్టర్ గారి సమక్షంలో దత్తత పత్రాలపై సంతకం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థులకు మా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా నాణ్యమైన విద్య అందాలన్నదే మా లక్ష్యం. అందుకోసమని ప్రతి సంవత్సరం వేర్వేరు జిల్లాలకు వెళ్లి సరైన మౌలిక సదుపాయలు లేని పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నాం. గత సంవత్సరం యాదాద్రి జిల్లాలో 50 స్కూళ్లను దత్తత తీసుకొని ఘన విజయంతో పూర్తిగా కంప్లీట్ చేశాం. ఇప్పుడయితే గద్వాల్ లో 30 స్కూళ్లను దత్తత తీసుకున్నాం. వీటిని అగస్టు వరకు స్కూల్ లోని క్లాస్ రూమ్స్ అన్నీ వసతులు అభివృద్ది చేస్తామని హమీ ఇస్తున్నాం. అలాగే మేము చేస్తున్న పనిని చూసి ఇంకా మిగతా ఊళ్లో కూడా అభివృద్ది చేయవల్సిన పనులు ఉంటే మాకు తెలియజేయండి. వాటిని అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తాం అని మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడి తన గొప్ప మనసును చాటుకుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.