మంచు లక్ష్మి.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అనంతరం తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవల హోం టూర్ చేసి తన ఇంటి విశేషాలను అందరికి షేర్ చేసుకుంది. మంచు లక్ష్మీ తాజాగా ఓ ట్వీట్ వేసింది. నేటికాలంలోని నిర్మాత కష్టాలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని మాత్రం నేరుగా చెప్పలేదు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్ “అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీ రివ్యూ!
ప్రస్తుతం కాలంలో సినిమా నిర్మాతగా వ్యవహరించడం ఎంత కష్టమో చెప్పుకొచ్చింది.”ఇప్పుడు నిర్మాతలను కేవలం ఫైనాన్షియర్లుగానే చూస్తున్నారు. సినిమా నిర్మాణంలో వారి పాత్ర కనుమరుగవుతోంది. ఓ సినిమాను నిర్మించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి.. అందరినీ మ్యానేజ్ చేయాలి..సమర్థవంతంగా ఉండాలి.. నిర్లక్ష్యం, ఈగోలు, యాటిట్యూడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.. అప్పటి నుంచి ఒక్క షాట్ కోసం ఎదురుచూస్తున్నా. నిర్మాతల కష్టాలు.. యాక్టర్స్ బతుకే సో బెటర్” అంటూ ట్వీట్ చేసింది. కొందరు నెటిజన్లు అసలేం జరిగింది.. ఎందుకు ట్వీట్ వేశావ్? నీ బాధ ఏంటి.. నువ్వు ఇంకా ఇండస్ట్రీని వదిలిపోవా? అంటూ నానా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మంచు లక్ష్మీ ఇలా ట్వీట్ వేయడానికి గల కారణం ఏంటో మాత్రం బయటకు రాలేదు. మరి..మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Pushed to your limits EVERYDAY! Producing a movie requires skills more than what is needed for a movie. People management, inefficiency, recklessness, egos and attitudes. When does one get the shot! Grrrrrr soooo irritated. #producerkasthalu #rant #actorbrathukusobetteru
— Lakshmi Manchu (@LakshmiManchu) May 6, 2022
What is your problem?
— Nag_don (@Nageshp0669) May 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.