మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కుమార్తెగా కాకుండా.. తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. నటి, వ్యాఖ్యాత, నిర్మాతగా.. పలు రంగాల్లో రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు మంచు లక్ష్మి. ఇక కొన్ని సార్లు ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు వివాదాస్పదంగా మారాతాయి. ఈ సంగతి ఎలా ఉన్నా.. మంచు లక్ష్మికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎక్కడికైనా వస్తుందని తెలిస్తే.. లక్ష్మిని చూడటానికి జనాలు భారీగా తరలి వస్తారు. ఆమెను చూసేందుకు ఎగబడతారు.
తాజాగా ఇదే సన్నివేశం రిపీట్ అయ్యింది. మంచు లక్ష్మిని చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. పైగా ఆమెను ఒపెన్ టాప్ జీప్‌లో కూర్చొబెట్టి.. దారంతా పూలు చల్లుతూ.. గ్రాండ్ వెల్కమ్ చెప్పారు జనాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
తాజాగా మంచు లక్ష్మి.. శ్రీకాకుళం జిల్లాలో సందడి చేశారు. పాతపట్నం మండలం కొరసవాడకు వచ్చారు మంచు లక్ష్మి. ఎందుకు అంటే.. ఆమె టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన అందించాలనేది ఆమె ఉద్దేశం. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించారు మంచులక్ష్మి. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఏకంగా ఓపెన్ టాప్ జీప్‌లో ఆమెని కూర్చొబెట్టి ఊరేగించారు ఆ ఊరి జనం. దారంతా పూలు చల్లుతూ.. సీఎం రేంజ్‌లో లక్ష్మిని ఆహ్వానించారు గ్రామస్తులు.
ఇక పాఠశాలకు చేరుకున్న మంచు లక్ష్మి.. స్మార్ట్ క్లాస్ రూమ్‌ని ప్రారంభించారు. ఇక డిజిటల్ విద్యాబోధన కోసం ఈ స్కూల్‌లో 3 లక్షల రూపాయాల ఖర్చుతో.. తరగతి గదిలో వాల్ పెయింటింగ్, ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. అంతేకాక విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ స్మార్ట్ క్లాస్ రూం కోసం మంచు లక్ష్మి ట్రస్ట్ నిధులను సమకూర్చింది. ఇక డిజిటల్ విద్యా బోధన కోసం గాను ఈ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కి మెరుగైన విద్యను అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలిపారు. ఈ విషయం తెలిసిన జనాలు.. మంచు లక్ష్మి చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసలు కురిపించారు.