సినీ పరిశ్రమలో మంచు వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక మంచు లక్ష్మి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు కుటుంబ సంగతులు షేర్ చేస్తుంటుంది. తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు కలిసి లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్లో ఎత్తిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మంచు విష్ణు తన కుటుంబసభ్యులను ఒక్కోక్కరిగా స్విమ్మింగ్ పూల్లో నెట్టేస్తు ఉన్నారు.
ఈ క్రమంలో మంచు లక్ష్మి వద్దకు మంచు విష్ణు వెల్లడం ఆమెను ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకు వచ్చాడు. మంచు లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టంది. ఇక మంచు విష్ణు… ఆమెకు ఎత్తుకుని వస్తుంటే.. మోహన్ బాబు లక్ష్మి చేతులు పట్టుకుని విష్ణుకు సహాయం చేస్తూ.. మెను నీళ్లలో పడేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. అంతా నా కర్మ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.