చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం అనేది మామూలే. సినిమాలు చేసినా, చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. లేదా ఏదొక విషయంలో సెలబ్రిటీలు ట్రోల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే.. ట్రోల్స్ అనేవి కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ని టచ్ చేయనంతవరకు బాగానే ఉంటుంది. తమ గురించి ఎన్ని ట్రోల్స్ చేసినా భరించే సెలబ్రిటీలు.. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీస్ జోలికి వస్తే అసలు ఊరుకోరు. టాలీవుడ్ లో రెగ్యులర్ గా సోషల్ మీడియా ట్రోల్స్ ని ఫేస్ చేసేవారిలో మంచు ఫ్యామిలీ పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఆ ట్రోల్స్ ని కూడా వారు ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో అంతవరకు చేస్తారు.
మంచు ఫ్యామిలీకి సంబంధించి మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మిలతో పాటు అప్పుడప్పుడు మంచు మనోజ్ పేరు కూడా ట్రోల్స్ లో మార్మోగుతుంటుంది. సినిమాలు, ప్రెస్ మీట్స్ లతో మంచు విష్ణుని, సోషల్ మీడియా పోస్టులతో మంచు లక్ష్మిని.. ప్రెస్ మీట్ లో స్పీచ్ లతో మోహన్ బాబును ట్రోల్ చేస్తుంటారు ట్రోలర్స్. అయితే.. రీసెంట్ గా లిస్టులో మంచు మనోజ్ కూడా చేరాడు. అందుకు కారణం లేకపోలేదు.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. ప్రముఖ పొలిటిషన్ భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికా రెడ్డితో కలిసి పలుమార్లు కెమెరాల కంట పడేసరికి.. మనోజ్ ఆమెతో డేటింగ్ లో ఉన్నాడని, అందుకే కొంతకాలంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తమ ఫ్యామిలీలో విభేదాలు జరిగి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని వినిపిస్తున్న రూమర్స్ పై మంచు లక్ష్మి స్పందించింది. ఫ్యామిలీలో బ్రదర్స్ కి, తమకు మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. “మా ఫ్యామిలీకి సంబందించిన విషయాలన్నీ మా పర్సనల్. ఎందుకంటే.. మేమెప్పుడూ కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. విష్ణుకి ఫ్యామిలీ, పిల్లలు, బిజినెస్ వాటికే టైమ్ సరిపోతుంది.. ఇక ఎక్కువగా నేను, మనోజ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం. అందుకే ఎక్కడైనా మేమిద్దరమే ఎక్కువగా కనిపిస్తాం” అని చెప్పింది. దీంతో ఓవైపు మంచు ఫ్యామిలీలో ఏమి లేవని అనుకుంటున్నారు. మరోవైపు లక్ష్మి మాటలు విని మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరినట్లు అయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మంచు ఫ్యామిలీలో విభేదాలు అనే రూమర్స్ పై మంచు లక్ష్మి స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.