తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ క్రేజ్ వేరు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు దగ్గరనుండి విష్ణు, మనోజ్ లతో పాటు మంచు లక్ష్మి వరకు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు లక్ష్మిల ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సినీ నటిగా రాణిస్తూనే అడపాదడపా టీవీ షోలకు హోస్ట్ గా అలరిస్తోంది. తాజాగా మంచు లక్ష్మి పోస్ట్ చేసిన పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
మంచు లక్ష్మి తాజాగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ లతో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఫొటోతో పాటు.. “ఎల్లప్పుడూ నా వెన్నంటే అండగా ఉంటున్నందుకు థ్యాంక్స్. మీరిద్దరూ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను” అంటూ హ్యాపీ క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోలో మంచు లక్ష్మితో పాటు విష్ణు, మనోజ్ లు కూడా వైట్ డ్రెస్ లో కనిపించడం విశేషం. ఇక మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా స్పెషల్ ఏంటని అడుగుతున్నారు. మరి మంచు ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.