నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ.. థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. బాలయ్య మాస్ పల్స్ కు తగ్గట్లుగా సాంగ్స్ డిజైన్ చేశాడు. ఇక ఇందులోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్న సాంగ్ మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేపిస్తుంది. ఇప్పటికే ఈ పాటకు సోషల్ మీడియా మెుత్తం ఊగిపోతోంది.
తాజాగా ఈ మాస్ పాటకు చిందేసింది మంచు లక్ష్మి. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ మంచు లక్ష్మి వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంచు లక్ష్మి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మంచు లక్ష్మి. తొలి చిత్రంతోనే నంది అవార్డును గెలుచుకుని విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.
ఈ క్రమంలోనే సిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు టాక్ షోలు చేస్తోంది. అయితే సోషల్ మీడియాతో ఎంతో యాక్టీవ్ గా ఉండే లక్ష్మి మంచు.. తన కూతురితో చేసే అల్లరి వీడియోలతో పాటుగా, షూటింగ్ లోకేషన్స్ లో తీసే వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా బాలయ్య పాటకు మాస్ స్టెప్పులు వేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ కు మాస్ స్టెప్పులు.. క్యూట్ లుక్స్ లో అదరగొట్టింది మంచు లక్ష్మి. ఇక ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నా ఎదురుచూపులకు ఈ రోజు తెరపడింది. అంటూ రాసుకొచ్చింది మంచు వారి అమ్మాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.