దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుండి పలువురు సెలబ్రిటీలు చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. మొన్న రానా లగేజ్ విషయంలో ఆయనకు చుక్కలు చూపిస్తే, తాజాగా నటి మంచు లక్ష్మి పట్ల నిర్లక్ష్య ధోరణితో నడుచుకుంది.
ఇటీవల విమానయాన సంస్థల నుండి నటీనటులు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. సెలబ్రిటీలు ప్రయాణించే సమయంలో సదరు విమానాయన సంస్థలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య కాలంలో యాంకర్ కమ్ నటి అనసూయ, ఆమె కుటుంబాన్ని పరుగులు పెట్టించగా.. మొన్న నటుడు రానా లగేజీ విషయంలో సరైన సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసింది. తాజాగా మరో నటి మంచి లక్ష్మి ప్రసన్నకి చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు ఆమె ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్‌లు చేశారు. ‘మంచిగా ఉంటే పని అవ్వదు. విమానంలో నా పర్స్ మరిచిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా?’ అని ప్రశ్నిస్తూ మొదట మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌లో ఇండిగో ట్విట్టర్ అకౌంట్‌ను కాకుండా తప్పుగా మరో అకౌంట్‌ను ట్యాగ్ చేశారు.
ఈ తరువాత ఇండిగో ఎయిర్ లైన్స్‌కు కరెక్ట్‌గా ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ‘ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కన్నా త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. సరికదా వాళ్లు క్షణాల్లో కనుమరుగైపోయారు.103 డిగ్రీల జ్వరం కూడా ఎలాంటి సాయం చేయలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’అని మరో ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు గంట నుండి వెయిట్ చేస్తున్నా. సాయం చేసేందుకు ఒక్కరూ కూడా లేరు. గ్రౌండ్ స్టాఫ్ కూడా లేరు. మీరు జీరో సేవలందిస్తూ, ఎలా పనిచేస్తున్నారు’ అని ట్వీట్‌లో మంచు లక్ష్మి పేర్కొన్నారు. మంచు లక్ష్మి ట్వీట్‌కు ఇండిగో సంస్థ స్పందించింది.
‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. విమానంలో మీరు మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని మేం నమ్ముతున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మరోసారి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి’ అని ఇండిగో వివరణ ఇచ్చింది. అయితే మంచు ఫ్యాన్స్ దీనిపై మండిపడుతున్నారు. ‘డియర్ ఇండిగో, బ్యాన్ ఇండిగో’ అని కామెంట్లు పెడుతున్నారు.
I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023
Ma’am, thank you for speaking with our manager at Hyderabad Airport. We believe our team assisted you in retrieving your bag that was left onboard. 1/2
— IndiGo (@IndiGo6E) March 6, 2023