హనీ రోజ్.. ప్రస్తుతం కుర్రకారు తరుచుగా జపిస్తున్న నటి పేరిది. అందం, అభినయంతో హనీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. 2008లో వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారామె. తెలుగు తెరకు పరిచయమై 10 ఏళ్లు దాటినా పెద్దగా అవకాశాలు, గుర్తింపు రాలేదు. ఇలాంటి టైంలో హనీ రోజ్ సినిమా జీవితంలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె దశ మారింది. వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఒక్క సినిమాతో హనీ రోజ్ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన పేరులా మరిపోయింది.
ఇక, హనీ రోజ్ మొదటి నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఉన్నారు. మాతృ బాష మలయాళంలోనే కాదు.. మిగిలిన అన్ని భాషల్లో తన పాత్ర భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’ మూవీలో ఓ భిన్నమైన పాత్రలో కనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే.. హనీ రోజ్‌ను ఇలాంటి పాత్రలో చూడటం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అని చెప్పాలి. ‘మాన్‌స్టర్’ మూవీలో ఆమె హోమో సెక్సువల్‌గా కనిపించారు. ఈమెకు జోడీగా ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మి నటించారు.
2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రజలు వాళ్ల పెళ్లిని అంగీకరించరు. ఇద్దర్నీ కొట్టి ఊరినుంచి పంపించేస్తారు. తర్వాత ఆ ఇద్దరు హోమో సెక్సువల్స్ ఏం చేశారనే దాన్ని బేస్ చేసుకుని ‘మాన్‌స్టర్’ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమాలో భామిని అనే పాత్ర హనీ రోజ్ చేయగా, దుర్గ అనే క్యారెక్టర్ ని మంచు లక్ష్మీ చేశారు. ఈ సినిమాలో ఈ జోడీ మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి రోల్స్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. హనీ రోజ్ తన పాత్రను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశారు. నటిగా మరో మెట్టు ఎక్కేశారు. తనకు పాత్ర నచ్చాలే గానీ ఎలాంటిది అయినా సరే చేసేస్తానని చెప్పకనే చెప్పారు. మరి, హనీరోజ్ హోమో సెక్సువల్ పాత్రలో నటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Honey rose and Lakshmi manchu lesbo smooch scene from ‘Monster’ pic.twitter.com/6JPM2IQN0i
— dean•fkin•ambrose 🤍🫂 (@Deanfkinambrose) December 3, 2022