టాలీవుడ్ లో మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ కొంచం ఖాళీ సమయం దొరికినా ఇద్దరూ కలిపి ఎంజాయ్ చేస్తుంటారు. మంచు లక్ష్మీ తనకు ఎప్పటికీ మంచి మిత్రురాలు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ 2022 సంవత్సరం స్టార్టింగ్ లో తన ఇన్ స్టాగ్రామ్ మొదటి పోస్ట్ ను మంచు లక్ష్మీకి డెడికేట్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో విషయాలను పంచుకోవడమే కాకుండా.. ఒకరి పోస్టులకు ఒకరు ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి చిల్ అవ్వడం, ఫొటోలు దిగి పెట్టడం, రీల్స్ చేయడం చూస్తూనే ఉంటాం.
తాజాగా మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ కలిసి చేసిన ఓ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన జుగ్ జుగ్ జీయే సినిమాలోని పంజాబ్బన్ సాంగ్ ట్రాక్ కూ ఇద్దరూ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ కలిసి వేసిన ఈ మాస్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంక, సినిమాల విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఇప్పటికే అటాక్ , రన్ వే 34 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ, ఛత్రీవాలీ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. థ్యాంక్ గాడ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళ్ లో అయలాన్, తెలుగులో 31 అక్టోబర్ లేడీస్ నైట్ సినిమాలు చేస్తోంది.
మంచు లక్ష్మీ సినిమాల విషయానికి వస్తే.. 2018 తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మా వింత గాథ వినుమా సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ తర్వాత 2021లో పిట్ట కథలు అనే నెట్ ఫ్లిక్స్ సినిమాలో నటించింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాలో లీడ్ రోల్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ మాస్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.