మంచు లక్ష్మి.. పేరు వినపడ్డా.. కనపడ్డా ట్రోలర్స్ ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. మరీ ముఖ్యంగా ఆమె యాక్సెంట్‌ని ఎంతో ట్రోల్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో ఇలా ఎంత నెగిటివిటీ ఉన్నా సరే.. దాన్ని పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తుంది మంచు లక్ష్మి. ఇక వెండితెర మీద కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఇటు ట్రెడిషినల్‌గానూ.. అటు మోడ్రన్ గానూ.. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్.. నటనకు స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తోంది. ఇక తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ఇక తనను ఎంత ట్రోల్ చేసిన.. తన మంచి పనులతో అందరిని మెప్పిస్తునే ఉంటుంది మంచు వారి అమ్మాయి.. ఈ క్రమంలో తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకుంది మంచు లక్ష్మి.
ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంది మంచు లక్ష్మి. అలాగే టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంతో టీచర్స్ లేని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తాజాగా మరో మంచి పనికి సిద్ధమైంది మంచు లక్ష్మి. తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచు లక్ష్మి తన టెక్ ఫర్ చేంజ్ సంస్థతోనే 50 స్కూళ్లు దత్తత తీసుకుంటానని ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని, 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ పాఠశాలల్లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి తెలిపింది. మంచు లక్ష్మి చేసిన ఈ పనిని అంతా అభినందిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@Teachforchangei chaired by @LakshmiManchu signed MoU with #Yadadri district to undertake quality improvement program in 50 schools to augment efforts made under Mana Ooru Mana Badi@TelanganaCMO @KTRTRS @SabithaindraTRS @TelanganaCS @jayesh_ranjan @SmitaSabharwal pic.twitter.com/Azaz4bA98V
— Collector Yadadri (@Collector_YDR) July 21, 2022