టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రోల్స్ కారణంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా‘ సినిమా ప్లాప్ అయ్యిందని.. ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు ట్రోలర్స్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది. అయితే.. తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేశారు.
శ్రీ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. తిరుపతి అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కేసు వేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ సునీల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉన్నాను. ఎప్పుడు కూడా మోహన్ బాబు ఫ్యాన్స్ వేరే హీరోలపై కామెంట్స్ చేయలేదు.ఇటీవల సన్ ఆఫ్ ఇండియా మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి కొంతమంది ట్రోలర్స్ మంచు కుటుంబం పై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. 1, 2 కాదు 100 పైగా యూట్యూబ్ ఛానల్స్ వారు సినిమా రిలీజ్ ముందే సినిమా బాగాలేదని ట్రోల్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.