సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లు అలా మెరిసి..ఇలా మాయమైపోయారు. ఒకటి రెండు సినిమాల్లో కనిపించి తమదైన అందంతో ఆకట్టుకుంటారు. ఈ అమ్మడు ఎంతబాగుందో అని ప్రేక్షకులు అనుకునే లోగా సినిమాలో నుంచి కనుమరుగై పోతుంటారు. ఆ విధంగా సినిమాలోకి అలావచ్చి ఇలా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తమ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. చాలా మంది ప్రేక్షకులు ..ఫలాన సినిమాలో కనిపించిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే కనుమరుగైన కొందరు హీరోయిన్స్ ప్రేక్షకులు కనిపెట్టేశారు. తాజాగా మరో ముద్దుగుమ్మ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘బిందాస్’ మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. మనోజ్ కు మంచి గుర్తింపు ఇచ్చిన సినిమాలో ఇది ఒకటి. మంచి కంటెంట్ తో పాటు కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలో అల్లరి చేసే యువకుడి పాత్రలో మనోజ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో మనోజ్ కు జోడిగా షీనా షహబాది నటించింది. హీరో అల్లరి పనులకు ధీటుగా సమాధానం ఇచ్చే మరదలి పాత్రలో ఈ అమ్మడు నటిచింది. ఈ చిత్రంలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోయింది.
ఈ సినిమాలో అమాయకత్వం, అల్లరితో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కూడ కనిపించింది. యాక్షన్ త్రీడీ, నందీశ్వరుడు, నువ్వే నాబంగారం, గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ కు చేక్కేసింది. హిందీలో చాలా సినిమాలే చేసింది. అక్కడ కొంతకాలం పాటు చాలా బిజీగా గడిపింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో కనుమరుగైంది. అయితే ఇటీవల ఈ అమ్మడి గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తోన్నారు. చూడటానికి క్యూట్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుందా? అని అంతా ఆరా తీస్తున్నారు.
2015 వరకు సినిమాల్లో నటించిన షీనా ఆ తర్వాత రెండు టీవీ సిరీస్ లలో నటించింది. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతంరం ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరగని అందంతో ఇప్పటికే అంతే ముద్దుగా ఉంది ఈ భామ. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.