తెలుగు ఇండస్ట్రీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ తర్వాత ‘అందాలరాముడు’ చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న మినహా సునీల్ కి ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో మళ్లీ కమెడీయన్ గా కొనసాగుతున్నాడు. అయితే తనకు ఎలాంటి పాత్ర ఇచ్చిన పూర్తి న్యాయం చేస్తానని చెబుతున్న సునీల్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’ చిత్రంలో విలన్ అవతారం ఎత్తాడు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే దాక్కో.. దాక్కో మేక.., శ్రీవల్లి సాంగులు విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో సునీల్ ‘మంగళం శ్రీను’ అనే పాత్రను పోషించాడు. సునీల్ తన కెరీర్లో గుర్తుండి పోయే పాత్రను చేస్తున్నాడట. పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది.
మంగళం శ్రీను గా సునీల్ బట్ట తల,బొట్టు, ఎర్రని కళ్లు సీరియస్ లుక్ తో భయంకరంగా కనిపిస్తున్నాడు. సుకుమార్ సినిమాల్లో పాత్రలై ఎంత నాచురల్ గా హుందాగా ఉంటాయో దీనితో మరోసారి అర్ధం అవుతుంది. తన డ్రెస్సింగ్ కానీ రగ్గుడ్ లుక్ కానీ అసలు సునీల్ ఈ రేంజ్ లో ఉంటాడా అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. అంతే కాదు ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ కూడా ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సునీల్ భాష నడవడిక ఏ తీరుగా ఉంటాయో చూడాలి. ఇటీవల సినిమాలో విలన్ ఫహద్ పాత్ర ని రివీల్ చేశారు.