లేడీ సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అనేది మామూలే. అయితే ఆ ఫాలోవర్స్ లో వరస్ట్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. గతంలో అనసూయని ట్విట్టర్ లో అసభ్య పదజాలంతో తిడుతూ.. బాడీ షేమింగ్ చేస్తూ వేధించాడో యువకుడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ని వేధించిన యువకుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉర్ఫీ జావేద్ గత కొంతకాలంగా బెదిరింపులను ఎదుర్కొంటుంది. అత్యాచారం చేస్తామని, చంపేస్తామని కొంతమంది ఆమెను బెదిరిస్తున్నారు. డైరెక్ట్ గా ఆమెకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది.
ఆమెకు బెదిరింపులు మరీ ఎక్కువ అవ్వడంతో ఆమె ఏడుస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అయితే ఉర్ఫీ జావేద్ ను అత్యాచారం చేస్తానని, చంపేస్తానని బెదిరించిన యువకుడ్ని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ గిరి అనే యువకుడ్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల సెక్షన్ 354(ఏ), వెంబడించడం 354(డి), బెదిరింపులకు పాల్పడినందుకు 509, 506 సెక్షన్ల కింద అలానే ఐటీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. వాట్సాప్ ద్వారా బెదిరింపు మెసేజ్ లు పంపించాడు. అత్యాచారం చేస్తానని, చంపేస్తానని బెదిరిస్తూ మెసేజ్ లు చేసేవాడు.
Mumbai | Goregaon Police arrested a man, Naveen Giri for giving rape & life threats through WhatsApp to TV actress & social media influencer Uorfi Javed. FIR was registered u/s 354(A) (sexual harassment), 354(D) (stalking), 509, 506 (criminal intimidation)of IPC as well as IT Act pic.twitter.com/r2Q9dnMZtO
— ANI (@ANI) December 22, 2022
విసిగిపోయిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు గుర్గావ్ లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశామని ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి ఉర్ఫీ జావేద్ ని బెదిరించిన యువకుడిపై మీ అభిప్రాయం ఏమిటి? సెలబ్రిటీలనే ఇలా బెదిరిస్తున్నారంటే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? లోపం ఎక్కడ ఉంది? పెంపకంలోనా? లేక వ్యవస్థలోనా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.