Mallika Sherawat: కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంలా మార్చింది మాత్రం సినిమా ఫీల్డ్‌కి చెందిన వారే. హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలంటే సదరు అమ్మాయి కమిట్‌మెంట్ ఇవ్వాలన్నది గ్లామర్ ఫీల్డ్‌లో ఒక భాగమైపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఇష్టం లేనివాళ్ళు మాత్రం ఈ కంపు మాకొద్దని కాంపౌండ్ నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది నటీమణులకి సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటే దానికి కారణం.. టాలెంట్ లేకపోవడం కాదు, శరీరాన్ని తప్ప టాలెంట్‌ను గుర్తించే వాళ్ళు లేకపోవడం. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక బతికే నటీమణులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్‌కి చెందిన మల్లికా శెరావత్ ఒకరు. తాను కూడా అవకాశాల కోసం అనేక అవమానాలను ఎదుర్కున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను ఎవరితోనూ.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని, అందుకే అగ్ర హీరోలెవరూ తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకోలేదని అన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి రమ్మని పిలుస్తారని, ఆ సమయంలో వెళ్తేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని వెల్లడించారు. కమిట్మెంట్ ఇవ్వకపోతే సినిమాల నుంచి తప్పుకోవాల్సిందేనని, హీరోయిన్స్‌ని డిసైడ్ చేసేది హీరోలే అని, కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. కానీ తాను అలాంటి దాన్ని కాదని, నా వ్యక్తిత్వం అది కాదని ఆమె అన్నారు. తాను ఇతరుల ఇష్టాలు, అభిరుచులకు లోబడి ఉండకూడదనుకున్నానని, ఆటబొమ్మలా ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. కూర్చో.. నిలబడు.. అని వాళ్ళు చెప్పినట్టు చేసే టైప్ కాదని చెప్పుకొచ్చారు.
మర్డర్ సినిమాలో ఇమ్రాన్ హష్మితో కలిసి రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే తనపై విమర్శలు గుప్పించారని, కానీ దీపికా పదుకునే.. గెహ్రాయాన్ మూవీలో ఘాటుగా రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే అందరూ మెచ్చుకుంటున్నారని, తననెందుకు దీపికను ప్రశంసించినట్టు ప్రశంసించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఒక వర్గం మీడియా తనను మానసికంగా హింసించిందని ఆమె అన్నారు. తన శరీరం గురించి, గ్లామర్ గురించి మాత్రమే మాట్లాడతారని, నటన గురించి ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. దశావతారం, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్ సినిమాల్లో నటించాను కానీ తన నటన ఎవరూ గుర్తించలేదని వాపోయారు. మరి బాలీవుడ్‌లో మల్లికా శెరావత్ ఫేస్ చేసిన ఈ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.