సీనియర్ నటుడు నరేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. భార్యని బూతులు తిడుతూ, పవిత్రా లోకేష్ తో రొమాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.
టాలీవుడ్ లో సినిమాల గురించి మాట్లాడుకోవడం కామన్. వాటిని దాటి బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉందా అంటే.. నరేష్-పవిత్రా లోకేష్ లవ్ మ్యాటర్ మాత్రమే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మూడో భార్య విడాకుల విషయం ఇంకా కోర్టులో ఉండగానే పవిత్రతో కలిసి కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత నరేష్, అతడి మూడో భార్య రమ్య రఘుపతి.. ఒకరిపై ఒకరి కేసులు పెట్టుకోవడం పెద్ద రచ్చ అయింది. ఆ తర్వాత నరేష్-పవిత్ర పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు.
అసలు విషయానికొస్తే.. నరేష్-పవిత్రా లోకేష్ న్యూయర్ సందర్భంగా ముద్దుపెట్టుకున్న వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసేసుకున్నామని మరో వీడియో రిలీజ్ చేశారు. దీంతో నిజంగానే వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారా అని అందరూ తెగ డౌట్ పడ్డారు. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చాలానే వినిపించాయి. కానీ ఈ తతంగమంతా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా కోసమని తెలిసి అవాక్కయ్యారు. అప్పటినుంచి ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే తెగ ఇంట్రెస్ట్ చూపించసాగారు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా… నరేష్-పవిత్ర రిలేషన్ మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది.
‘మళ్లీ పెళ్లి’ టీజర్ చూస్తుంటే.. ఇది సినిమాలా లేదు. నరేష్ బయోపిక్ లా అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే సీన్లు కూడా ఉన్నాయి. నరేష్ ని సినిమాలోనూ యాక్టర్ గా చూపించారు. కన్నడ నటి పార్వతితో రిలేషన్ షిప్, దీంతో నరేష్ భార్య మీడియా ముందుకు రావడం, ఆమెని బూతులు తిట్టడం, హోటల్ లో భార్యని చూస్తూ నరేష్ విజిల్ వేయడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ సమ్మర్ కి మంచి ఎంటర్ టైనర్ రాబోతుందని తెలుస్తోంది. భార్యని బూతులు తిడుతూ, పవిత్రతో రొమాన్స్ చేసే సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనిపిస్తున్నాయి. మరి టీజర్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.