సంచలన జంట నరేష్-పవిత్రాలోకేష్‌లు నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.
నరేష్- పవిత్రాలోకేష్‌ల రిలేషన్ ఎంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కొన్ని నెలల పాటు వీరి రిలేషన్ దేశ వ్యాప్తంగా ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నరేష్ తన ప్రేమ కథను సినిమాగా తీసేశారు. ఇద్దరి మధ్యా ప్రేమ ఎలా పుట్టింది.. వివాదం సమయంలో జరిగిన సంఘటనలు.. ఇతర విషయాలను చూపిస్తూ ఓ సినిమా తీశారు. దానికి ‘మళ్లీ పెళ్లి’ అన్న టైటిల్ పెట్టి తెరపైకి తీసుకువచ్చారు. ఫస్ట్ గ్లిప్స్ నుండి సినిమా విడుదల వరకు ప్రమోషన్లలో నరేష్ పీక్స్‌ను చూపించారు. ప్రమోషన్ టెక్నిక్‌లతో జనాలను పిచ్చివాళ్లు చేశారు. ఈ సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందే బజ్ క్రియేట్ కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. విడుదలకు ముందున్న బజ్‌తో మొదటి రోజు టిక్కెట్లు బాగానే అమ్ముడయ్యాయి. ఫస్ట్ డే ఈ సినిమా మంచి కలెక్షన్లనే సంపాదించింది. దాదాపు 30 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక, ఈ సినిమా ఓటీటీ విడుదల కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. అయితే, డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. సినిమాకు వచ్చే స్పందనను బట్టి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి, ‘మళ్లీ పెళ్లి’ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.