చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సెలబ్రిటీల వరుస మరణాలను మర్చిపోలేకపోతున్న ప్రేక్షకులకు మరో చేదువార్త ఎదురైంది. ప్రముఖ నటి రష్మీ జయగోపాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీ నటిగా, సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మీ.. ఇక లేరనే వార్త ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేయగా, ప్రేక్షకులలో.. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ లో విషాదాన్ని నింపింది. ‘స్వంతం సుజాత’ అనే సీరియల్ లో సారమ్మ క్యారెక్టర్ ద్వారా పాపులర్ అయినటువంటి రష్మీ.. సెప్టెంబర్ 18(ఆదివారం)న సాయంత్రం కన్నుమూసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
రష్మీ జయగోపాల్ మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. కాగా ఆమెకు భర్త జయగోపాల్, కుమారుడు ప్రశాంత్ కేశవ ఉన్నట్లు సమాచారం. బెంగుళూరులో పుట్టి పెరిగిన రష్మీ జయగోపాల్.. కమర్షియల్ యాడ్స్ ద్వారా యాక్టింగ్ రంగంలో అడుగుపెట్టింది. అలాగే మలయాళం, తమిళ భాషలలో టీవీ సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తాజా సమాచారం.. రష్మీ తిరువనంతపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి రాగానే అస్వస్థతకు గురైందని, ఇక హాస్పిటల్ లో చేరిన కొద్దిరోజులకే ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది.
రష్మీ జయగోపాల్.. కెరీర్ లో ‘స్వంతం సుజాత’ సీరియల్ ద్వారా బ్రేక్ అందుకుంది. ఆ సీరియల్ లో ఆమె పోషించిన ‘సారమ్మ’ పాత్ర ఎంతో పేరు తీసుకొచ్చింది. ఈ క్రమంలో రష్మీతో కలిసి స్వంతం సుజాత సీరియల్ లో నటించిన సహనటులు కిషోర్ సత్య, చంద్ర లక్ష్మణ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. రష్మీతో కలిసి దిగిన చివరి ఫోటోను షేర్ చేస్తూ.. “మనం కలిసి దిగిన ఆఖరి ఫోటో ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. మా ప్రియమైన చేచి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ప్రేమకు ప్రతిరూపమైన రష్మీ చేచి.. ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది” అంటూ చంద్ర లక్ష్మణ్ పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో రష్మీ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు ఫ్యాన్స్. మరి సీరియల్ యాక్టర్ రష్మీ జయగోపాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.ఆలోచిస్తున్నాము…