అవును మీరు చూసింది కరెక్టే. ఇదేం సినిమా కోసమో స్కిట్ కోసమో కాదు.. నిజంగా ఓ నటి రోడ్లపై లాటరీ టికెట్స్ అమ్ముకుంటోంది. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందరి తారల్లానే ఆమెది కూడా విలాసవంతమైన జీవితం. 35కి పైగా సినిమాల్లో నటించింది. ఆ డబ్బుతోనే కూతుళ్ల పెళ్లి కూడా చేసింది. పనిలో పనిగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. కానీ చాలామంది జీవితాల్లోకి పిడుగుపాటుల వచ్చిన కరోనా.. ఈమె లైఫ్ లోకి కూడా ఎంటరైంది. దెబ్బకి ఈమె లైఫ్ తలకిందులైపోయింది. లగ్జరీ జీవితం కాస్త రోడ్డున పడిపోయింది. దీంతో రోజుల వ్యవధిలో పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ హీరోగా 2016లో వచ్చిన సినిమా ‘యాక్షన్ హీరో బిజు’. ఇందులో నటించి గుర్తింపు తెచ్చుకుంది మేరీ. ఆ తర్వాత ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’తో మరో హిట్ కొట్టింది. ఇవే కాకుండా పలు యాడ్స్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన డబ్బుతో కూతుళ్లు పెళ్లి గ్రాండ్ గా చేసింది. సరే సినిమా ఆఫర్లు వస్తుండటంతో మేరీ, తీర్చగలననే ఉద్దేశంతో అప్పు తీసుకుంది. ఇల్లు కట్టుకుంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈమె జీవితం అతలాకుతలం అయింది. ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో కుటుంబాన్ని చూసుకోవడానికి మేరీ చిన్న చితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈమె చిన్న కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. అతడి వైద్య ఖర్చులు, బ్యాంకు లోన్ తీర్చాలంటే కచ్చితంగా ఏదో ఓ పని చేయక తప్పలేదు.
దీంతో అలప్పీ ఎరముల్లూర్ లో నివాసముంటున్న ఈమె.. ఉదయం ఆరున్నరకు బయటకెళ్లి.. ఏ సాయంత్రానికో ఇంటికి చేరుకుంటుంది. రోజంతా కూడా రోడ్లపై లాటరీ టికెట్స్ అమ్ముతూ, ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మేరీ తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఎప్పటికైనా సరే నిర్మాతలు తనని పిలిచి అవకాశాలు ఇస్తారనే నమ్మకంతో ఉంది. ఆ ఆశతోనే లాటరీ టికెట్స్ అమ్ముతూ జీవనం సాగిస్తోంది. దీంతో ఈ విషయం మిగతా నటీనటులకు తెలిసి అయ్యో అనుకుంటున్నారు. మరి నటి మేరీ దీనావస్థపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.