ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు సంపత్ రాజ్ కుమార్ ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు..
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ కన్నడ నటుడు సంపత్ రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన మరువక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ మలయాళ నటుడు మముకోయ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం ఆయన మళప్పురం జిల్లాలోని కాలికావులో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిధిగా వెళ్లారు. అయితే, కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందే అస్వస్థతకు గురయ్యారు. స్టేజి మీదే కుప్పకూలారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడినుంచి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి కోయికోడ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కోయను పరీక్షించిన అక్కడి వైద్యులు ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు తేల్చారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్ హ్యామరేజ్ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు వెంటి లేటర్‌పై చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ కోయ మృత్యువాతపడ్డారు. కోయ మృతితో మలయాళ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.