ప్రముఖ నటి మాళవిక శ్రీనాథ్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను మా అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను గదిలోకి పిలిచి...
రంగం ఏదైనా ఆడవాళ్ల పట్ల వేధింపులు జరగటం సర్వ సాధారణంగా మారిపోయింది. తమకు ఎదురైన వేధింపుల గురించి కొంతమంది ధైర్యంగా బయట చెప్పగలుతుంటే.. మరికొంతమంది చెప్పలేక లోలోపల కుమిళిపోతున్నారు. ఇక, సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఒకటి మొదలైన తర్వాత కొందరు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ పేరిట తమను వేధించిన వారిని చట్టపరంగా శిక్షంచడానికి కూడా పూనుకుంటున్నారు. ఇంకా కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి బయటి ప్రపంచానికి ధైర్యంగా చెబుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మాళవిక శ్రీనాథ్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ మూడేళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. మంజు వారియర్ కూతురి పాత్ర కోసం నన్ను ఆడిషన్స్‌కు రమ్మన్నారు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవు. అందుకే ఆడిషన్స్‌కు వెళ్లటానికి నిశ్చయించుకున్నాను. సినిమా వాళ్లు మా ఇంటికి కారు పంపారు. ఓ బిల్డింగ్‌లో ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను మా అమ్మ, మా సోదరి అడిషన్స్ జరుగుతున్న చోటుకు వెళ్లాము. ఆడిషన్స్ సందర్భంగా ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ‘జుట్టు సరిగా లేదు. మేకప్ రూమ్ లోపలికి వెళ్లి సరి చేసుకోండి’ అన్నాడు. నేను లోపలికి వెళ్లాను. అతడు నా వెంట లోపలికి వచ్చాడు.
నన్ను అసభ్యంగా తడమటం మొదలుపెట్టాడు. ‘ఓ పది నిమిషాలు కోఆపరేట్ చేస్తే ఆ పాత్ర నీదే’ అని అన్నాడు. గది బయట మా అమ్మ, అక్క ఉన్నారన్న భయం కూడా లేకుండా అలా చేశాడు. నేను భయంతో ఏడుస్తూ అక్కడినుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాను. బయటకు వచ్చేశాను’’ అని అంది. మాళవిక 1999లో కేరళలోని పట్టాంబిలో జన్మించారు. ఆమె చిన్నతనం మొత్తం దుబాయ్‌లోనే గడిచింది. సినిమాల మీద ఆసక్తితో మోడలింగ్ మొదలుపెట్టారు. 2021లో వచ్చిన మధురం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ప్రసుత్తం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు.