కొన్నిసార్లు సినిమా కోసం చేసే రొమాంటిక్ సన్నివేశాల కారణంగా హీరోయిన్లు ట్రోల్స్ కి గురవుతుంటారు. ఆ రొమాంటిక్ సీన్స్ సినిమాకు ఎంతవరకు న్యాయం చేశాయోగాని, ఆ సీన్ వలన సదరు హీరోయిన్స్ ఫేస్ చేసే ప్రశ్నలు మాత్రం ఇబ్బందిని కలిగిస్తాయి. తాజాగా సినిమాలో చేసిన బెడ్ సీన్ పై నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటైన సమాధానం చెప్పి వార్తల్లో నిలిచింది మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ మలయాళీ కుట్టి.. సినీ ప్రేక్షకులకంటే గ్లామర్ ప్రియులకు బాగా సుపరిచితం.
చేసింది తక్కువ సినిమాలే కానీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా దక్కించుకుంది. అమ్మడికి అంత ఫ్యాన్ క్రేజ్ రావడానికి కారణం సినిమాలు కాదు. ఆమె గ్లామర్ షో. పేట సినిమాతో నటిగా మారిన మాళవిక, దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన ‘మారన్’ సినిమా చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మాళవిక ‘యుద్ర’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. అయితే.. ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలు పోస్టు చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి చాలా కాలమైందని.. ట్విట్టర్ లో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పిన మాళవిక.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఆ నెటిజన్ ఏమని అడిగాడంటే.. “మారన్ సినిమాలో బెడ్ సీన్ ని ఎన్నిసార్లు షూట్ చేశారు?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్పందించిన మాళవిక.. “నీ బుర్ర పాడైనట్లుంది” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.