పవన్ కళ్యాణ్ నుండి కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఇకపై వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు ఏపీ రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. రెండింటినీ సమంగా బ్యాలన్స్ చేస్తున్నారు పవన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఇకపై వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు ఏపీ రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. రెండింటినీ సమంగా బ్యాలన్స్ చేస్తున్నారు పవన్. అయితే.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఆల్రెడీ పదేళ్లు గడిచిపోయింది. అదీగాక మూడేళ్లకు ముందే వీరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ అనౌన్స్ చేశారు. అయినా ఇప్పటిదాకా ఆ సినిమా పట్టాలెక్కలేదు.
పవన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలాగైనా వెయిట్ చేస్తారు.. కానీ, హరీష్ కంటే ముందు అనౌన్స్ చేసిన సినిమాలు చకచకా అయిపోతున్నాయి. పైగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా అంటే.. అంచనాలు కూడా పీక్స్ కి చేరుకున్నాయి. అయితే.. మొత్తానికి మైత్రి మూవీస్ బ్యానర్ లో హరీష్ శంకర్.. పవన్ తో సెకండ్ మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా తెరకెక్కించిన హరీష్.. ఈసారి పవన్ తో సెకండ్ మూవీ కూడా వేరే మూవీ లైన్ తోనే రూపొందించనున్నాడు. దళపతి విజయ్ – అట్లీ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయిన ‘తెరి'(తెలుగులో పోలీసోడు) మూవీకి ఇది రీమేక్ గా రాబోతుంది.
వీరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ కూడా రీమేక్ అని తెలిసి ఫ్యాన్స్ కొంచం నిరాశ చెందారు. కానీ.. దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ గ్యారంటీ అని భరోసా ఇచ్చాడు. అయినా.. పోలీసోడు సినిమా తెలుగులో కూడా అందరూ చాలా ఏళ్లుగా చూసేశారు. ఆల్రెడీ చూసిన సినిమానే.. అదే కథనే మళ్లీ తీయడం ఎందుకని ఫ్యాన్స్ వాదన. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి కొత్తగా ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. పవన్ సరసన ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఓకే అయ్యిందని సినీ వర్గాల సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. పవన్ – హరీష్ కాంబో మూవీకి కథ, హీరోయిన్ రెండూ ముందుగా దళపతి విజయ్ తో చేసినవే కావడం. ఇక మాళవిక మోహనన్.. ప్రభాస్ – మారుతీ మూవీతో తెలుగు డెబ్యూ చేస్తోంది. మరి పవన్ – మాళవిక కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Entraaa sudden ga andharu nannu inthala mention chesthunnaaru ani shock ayyaa
Thega notification luThis pair 🤌
Finally happening 😭❤❤#PawanKalyan #MalavikaMohanan pic.twitter.com/KZgSIq6pSk— Sairam Kalyan (@SairaamKalyan) March 21, 2023
#update @PawanKalyan @harish2you సినిమాలో @MalavikaM_
— devipriya (@sairaaj44) March 21, 2023