ప్రముఖ బహుభాషా నటి మాళవిక మోహనన్ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌కు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా, ఆమె ఆస్క్‌మాళవిక చేపట్టారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరోయిన్ మాళవిక మోహనన్. ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాళవిక తెలుగులో ఏ సినిమా చేయకపోయినా.. డబ్బింగ్.. ఓటీటీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘క్రిష్టి’ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక, మాళవిక పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పుటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ట్విటర్ ఖాతాలో ‘ఆస్క్ మాళవిక’ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ ఆమెను ఓ ముద్దు అడిగాడు. ‘‘ మీరు నాకో ముద్దు ఇస్తారా?’ అని అడిగాడు. ఇందుకు మాళవిక స్పందిస్తూ.. ‘‘ ఇది మీ డీపీలోని.. ఎంతో అందంగా ఉన్న పిల్లి కోసం’’ అంటూ ఓ ముద్దు సింబల్‌ను పెట్టారు. తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఆమెను అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం మాళవిక తన ఫ్యాన్ డీపీలోని పిల్లికి ముద్దు ఇచ్చిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మాళవిక 2013లో వచ్చిన పట్టంపోలె అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2016లో నాను మత్తు వరలక్ష్మి అనే సినిమాతో కన్నడలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మాళవిక 2020లో మసబా మసబా అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. మరి, ముద్దు అడిగిన ఫ్యాన్‌కు తనదైన స్టైల్లో మాళవిక ముద్దు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So this is mainly for that super cute cat in your DP- 😘 hehe https://t.co/tbCpn6gxHp
— Malavika Mohanan (@MalavikaM_) May 19, 2023