ఈ మద్య సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల వారసులే కాదు.. హీరోయిన్ల వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ నటి మాలాశ్రీ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించింది. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.
90వ దశకంలో అందం, అభినయంతో అశేష అభిమానులని సంపాదించుకున్నారు మాలాశ్రీ. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మాలాశ్రీ కన్నడ నిర్మాత రామును పెళ్లి చేసుకుంది. ఇటీవల రాము కరోనా మహమ్మారి కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాలాశ్రీ తన కుమార్తె రాధనా రామ్ ను వెండితెరకు పరిచయం చేస్తుంది
కన్నడ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ స్టార్ పేరు తెచ్చుకున్న దర్శన్ హీరోగా D56 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ద్వారా మాలాశ్రీ కూతురు రాధనా రామ్ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాబర్ట్’ ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం జరిగింది. తొలి షాట్‌కు శ్రీ రవిశంకర్ గురూజీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా నటి మాలాశ్రీ మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో సంతోషంగా ఉంది.. నా కూతురు రాధనాకు శుభాకాంక్షలు. తనకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. అందుకే ముంబయిలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. రాక్‌లైన్ వెంకటేష్ నా సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. ఇండస్ట్రీలో తన భవిష్యత్ అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.’ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ರಾಕ್ಲೈನ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ನ ಹೊಸ ಚಿತ್ರ, ಚಾಲೆಂಜಿಂಗ್ ಸ್ಟಾರ್ ದರ್ಶನ್ ಅಭಿನಯದ #D56ಗೆ ಚಾಲನೆ ದೊರಕಿದ್ದು, ಆರ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್ನ ಶ್ರೀ ಶ್ರೀ ರವಿಶಂಕರ್ ಆಶೀರ್ವದಿಸಿದರು.! ತರುಣ್ ಸುಧೀರ್ ನಿರ್ದೇಶನದ ಈ ಚಿತ್ರದ ಮೂಲಕ ಕನಸಿನ ರಾಣಿ ಮಾಲಾಶ್ರೀ ಪುತ್ರಿ ರಾಧನಾ ರಾಮ್ ನಾಯಕಿಯಾಗಿ ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ಗೆ ಕಾಲಿಡುತ್ತಿದ್ದಾರೆ! pic.twitter.com/KQsF75Y13h
— RocklineEnt (@RocklineEnt) August 6, 2022