టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలొదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది.
ఈ క్రమంలో ‘మేజర్’ సినిమాకు సంబంధించి విశేషాలను నిర్మాతలు అనురాగ్, శరత్ మీడియాతో షేర్ చేసుకున్నారు. తమ బ్యానర్ లో మొదటి సినిమాగా మేజర్ తెరకెక్కడం ఆనందం వ్యక్తం చేసిన నిర్మాతలు. ఈ సినిమాకు అన్నివేళలా అండగా నిలిచిన మహేష్ బాబుకి థాంక్స్ చెప్పుకున్నారు. అనంతరం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. సందీప్ పేరెంట్స్ మేజర్ సినిమా ప్రివ్యూ వేసిన ప్రతి చోటుకి వచ్చారు. నిన్ననే శేష్ కి సినిమా బాగా నచ్చిందని మెసేజ్ చేశారు. అలాగే సినిమా కోసం ఇంకేమైనా ప్రమోషన్ చేయాలంటే వస్తామని అన్నారు. 2008లో 31 ఏళ్ళ సందీప్ ని కోల్పోయినవారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కొడుకును చూసుకుంటుంటే ఇంతకంటే ఏమివ్వగలం అనిపించింది.ఇక సందీప్ పేరెంట్స్ రాయల్టీ ఏమైనా అడిగారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “మేం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయం వాళ్ళను అడిగితే.. ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అని ఆవేశపడ్డారు. వారు ఇంతవరకు సందీప్ ఎల్ఐసి. పాలసీ డబ్బులు కూడా తీసుకోలేదు. అంతటి నిజాయతీపరులు. అందుకే వారితో సోషల్ మీడియా వేదికగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫౌండేషన్ ప్రారంభించి.. మిలిటరీలో చేరాలనుకుంటున్న యువతకు తగిన ఏర్పాట్లు చేసి, మద్దతుగా నిలుస్తామని చెప్పాము. అదే మేం సందీప్ తల్లిదండ్రులకు ఇచ్చే రాయల్టీ” అన్నారు. ప్రస్తుతం మేజర్ ప్రొడ్యూసర్స్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ మేజర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Major Movie Producers Interview Stills
#Majorhttps://t.co/oCeMiJTreQ pic.twitter.com/TosIjYMWK5
— #Rajanna(G🌐pi AdusuⓂilli) (@agk4444) June 7, 2022