సినిమా సెలబ్రిటీలకు సామాన్యుల మాదిరి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉండదు. మనలాగా ఓ సినిమాకు వెళ్లలేరు.. వీధుల్లోకి వచ్చి షాపింగ్ చేయలేరు. ఎందుకంటే.. వారు బయటకనపడితే.. అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెడతారు. అందుకే చాలామంది తారలు.. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా తాము నటించిన సినిమాలు కూడా చూడలేని పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంది. చాలా మంది తారలు.. మారు వేషాల్లో సినిమాలు చూసి వస్తుంటారు. కానీ ఓ సూపర్ స్టార్ సినిమా టికెట్ కోసం క్యూలైన్‌లో నిలబడ్డం గురించి ఎప్పుడైనా విన్నారా.. అది ఏ హాలీవుడ్ స్టార్ హీరోనో అయితే పర్లేదు.. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా సినిమా టికెట్ కోసం క్యూలైన్‌లో నిల్చున్నాడు అంటే.. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.
కానీ ఇది వాస్తవం. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. సినిమా టికెట్ కోసం క్యూలైన్‌లో నిల్చుంది తన మూవీ కోసం కాదు.. వేరే హీరో సినిమా చూడ్డానికి. అదేంటి మహేష్ బాబు తల్చుకుంటే.. స్పెషల్ షో వేయించుకోగలడు కదా.. మరి ఇలా ఎందుకు అంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: Anand Mahindra: సర్కారు వారి పాట సినిమాపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!
ఇప్పుడున్న సిట్యువేషన్స్‌లో సినిమాలను రూపొందించటం కంటే వాటిని జనాల్లోకి తీసుకెళ్లటం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత థియేటర్స్‌కు ప్రేక్షకులు వచ్చే శాతం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో తమ సినిమాలను డిఫరెంట్ పద్దతుల్లో ప్రమోట్ చేసుకోవటానికి మేకర్స్ నానా తిప్పలు పడుతున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. ప్రస్తుతం ఆయన మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు, మహేష్‌కు ఉన్న రిలేషనేంటో మనకు తెలుసు కదా. అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా నిర్మాతల్లో మహేష్ కూడా ఒకరు. అందుకనే ఆయన తన నిర్మాత స్థానంలో ఉండి మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Major: అదిరిపోయిన మేజర్ మూవీ! ధియేటర్ లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు!
ఈ సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. అందులో భాగంగా డిజిటల్ క్రియేటర్, యూ ట్యూబర్ నిహారికతో కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నిహారిక టికెట్స్ కోసం లైన్‌లో నిలుచుంటే ఆమె కంటే ముందు వచ్చి అడివి శేష్ నిలబడతాడు. దాంతో ఆమె అతనితో గొడవపడుతుంటుంది. ఇద్దరూ గొడవ పడుతుంటే.. వారి కంటే ముందు మహేష్ వచ్చి నిలబడతాడు. మహేష్‌ను చూడగానే ఆశ్చర్యపోతుంది. మా స్నేహితులను కూడా పిలవొచ్చా.. అంటే అందుకు సరే అంటుంది. దాంతో మరి కొంత మంది ఆ లైన్‌లో వచ్చి చేరుతారు. ఇక నిహారిక ఫోన్ నెంబర్ అడిగే లోపు మహేష్ వెళ్లిపోతాడు. ఆమె ఏం చేయకుండా కామ్‌గా ఉండిపోతుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ క్రియేటివ్ ఫన్నీ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F
— Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022
ఇది కూడా చదవండి: Major: 10 రోజులముందే థియేటర్లోకి రానున్న మేజర్ సినిమా!