Major : 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. విలక్షణ నటుడు అడవి శేష్ మేజర్ సందీప్ పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకులనుంచి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు సైతం సినిమా బాగుందంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. మేజర్ రివ్యూల పరంగానే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బెస్ట్ అనిపించుకుంది. అడవి శేష్ సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లను రాబట్టింది.
మేజర్ సినిమా.. శేష్ గత సినిమాలకంటే ఐదు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13.4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 6.70 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించింది. మేజర్ మొదటి రోజు కలెక్షన్లపై చిత్ర కథానాయకుడు అడవి శేష్ స్పందించారు. శనివారం ట్విటర్ వేదికగా మేజర్ ప్రపంచవ్యాప్త కలెక్లన్ల పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘ ఇండియా మేజర్‌ను ఇష్టపడుతోంది..’’ అంటూ రాసుకొచ్చారు.
#IndiaLovesMajor 🙂 pic.twitter.com/S7rU5C1aVc
— Adivi Sesh (@AdiviSesh) June 4, 2022
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ :
నిజాం : 1.75Cr
సీడెడ్ : 46L
ఉత్తరాంధ్ర : 51L
ఈస్ట్ గోదావరి : 34L
వెస్ట్ గోదావరి : 24L
గుంటూరు : 30L
క్రిష్ణ : 28L
నెల్లూరు : 19L
మొత్తం – 4.07CR(నెట్), (6.70CR~ గ్రాస్)
ప్రపంచవ్యాప్తంగా – 13.4Cr