అక్కినేని నాగచైతన్య మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనపై రూమర్లు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ మధ్య నటి శోభిత దూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతూ ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై మజిలీ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చైతూతో పెళ్లి విషయంపై స్పందించారు.
తనపై వస్తున్న రూమర్లపై ఆమె ఘాటుగా జవాబిచ్చారు. ఆ రూమర్లకు, తనకు సంబంధం లేకపోయినా.. దాని గురించి ఏమీ తెలియకపోయినా.. ఇంట్లో కూర్చుని అలా జరిగింది, అది జరిగింది, అలా జరిగి ఉండవచ్చునని, వాళ్ళు మీకు చెప్పలేదు, ఇది మీ బిజినెస్ కాదని ఆమె జవాబిచ్చారు. ఇక చైతూతో దివ్యాంశ కౌశిక్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై కూడా ఆమె స్పందించారు. నాగచైతన్యతో పెళ్లి రూమర్ అనగానే ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఐ లవ్ నాగచైతన్య, మంచి వ్యక్తి అని, చైతూపై తనకు క్రష్ ఉందని, చాలా బాగుంటాడని ఆమె అన్నారు. చైతూ తనకు సీనియర్ అని.. సెట్స్ లోకి వచ్చినప్పుడు కుర్చీలోంచి లేచి గౌరవిస్తానని అన్నారు. హీరో గారు దయచేసి కూర్చోండి అని అంటే.. ఇడియట్ కూర్చో అని చైతూ అంటారని ఆమె గుర్తు చేశారు.
ఇక చైతూతో తన పెళ్లి రూమర్ అసలు వినలేదని అన్నారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం దివ్యాంశ కౌశిక్ ని చైతూనే సజెస్ట్ చేశారని వచ్చిన వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో చైతూతో అసలు టచ్ లో లేనని.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అవకాశం రావడానికి కారణం చైతూ కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఇద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ వర్మ సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. మరి చైతూ, దివ్యాంశ కౌశిక్ పై వచ్చిన పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇస్తూ మజిలీ బ్యూటీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి