చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి భావోద్వేగంలో కూడుకుపోతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ నటి హంస నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఇది మరవకముందే బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి క్యాన్సర్ బారినపడినట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని నిజం చేస్తూ తెలిపాడు బీటౌన్ నటుడు అనుపమ్ ఖేర్.
మహిమా చౌదరి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ తను చేయబోయే ది సిగ్నేచర్ లో మహిమా నటించాలని కోరుకున్నానని, ఈ విషయాన్ని తనకు చెప్పే ప్రయత్నం చేశాను. అందుకు మహిమా ఒప్పుకోలేదని, దానికి కారణం క్యాన్సర్ తో పోరాడుతున్నాని తెలిపిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తనకు తెలిపిందని అనుపమ్ ఖేర్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: Vignesh Shivan: అందరికి నయనతార తెలుసు. కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న ఈ విగ్నేష్ శివన్ ఎవరు?మహిమా మాట్లాడుతూ.. నాకు నటించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయని, కానీ నాకు శిరోజాలు లేని కారణంగా వాటన్నిటినీ తిరస్కరించానని ఆమె తెలిపింది. కానీ అనుపమ్ ఖేర్ నుంచి ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఈ విషయంలో అనుపమ్ ముందు నిజాన్ని క్యాన్సర్ విషయాన్ని దాచలేకపోయానని హీరోయిన్ మహిమా తెలిపింది.
బ్రెస్ట్ క్యాన్సర్ నయం కావడానికి ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దీనిని ఎదుర్కునేందుకు అనేక మార్గాలున్నట్లుగా వైద్యులు ధైర్యాన్ని నింపుతున్నారని హీరోయిన్ మహిమా చౌదరి తన భావోద్వేగంతో వివరించే ప్రయత్నం చేసింది. మహిమా చౌదరికి బ్రెస్ట్ క్యాన్సన్ సోకిందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ లో కాస్త చర్చనీయాంశమవుతోంది. స్టార్ హీరోయిన్ మహిమా చౌదరి బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.