సూపర్ స్టార్ మహేశ్ బాబు.. స్టార్లు ఊరికే అయిపోరు. అందుకు ఎంతో కృషి, పట్టుదల కావాలి. అవన్నీ కలిగిన టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేశ్ కూడా ఒకడు. రీల్ హీరోగానే కాకుండా.. రియల్ హీరోగా కూడా మహేశ్ చేసే సాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆనందాలు నింపారు. ఇటీవల తండ్రి కృష్ణ కాలంచేయడంతో మహేశ్ ఎంతో కుంగిపోయాడు. కానీ, అలాగే బాధలో ఉండిపోలేదు. మహేశ్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పోయిన వారం రోజుల్లోనే నేను షూటింగ్ రెడీగా ఉన్నాను అంటూ త్రివిక్రమ్‌కు కబురు పంపాడు. త్వరలోనే సినిమా రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసుకుంటుంది అని ప్రకటించారు.
అయితే ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే మహేశ్ బాబు- త్రివిక్రమ్ సినిమా షూట్ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నా టాక్ ప్రకారం SSMB28 షెడ్యూల్ లేట్ అవుతుందని తెలుస్తోంది. అందుకు కారణం మహేశ్ బాబో, త్రివిక్రమో కాదు. హీరోయిన్ పూజా హెగ్దే వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. పూజా ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ అనే సినిమా. రెండోది సల్మాన్ ఖాన్‌తో కిసీకా భాయ్.. కిసీకా జాన్ సినిమాలో కూడా పూజా హెగ్దే హీరీయిన్ చేస్తోంది. ఇప్పుడు ఆ సినిమాల వల్లే పూజా డేట్స్ అడ్జస్ట్ కావడంలేదని చెబుతున్నారు.
ఈ విషయం బయటకు రాగానే పూజా హెగ్దేపై మహేశ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపోయిన బాధలో కూడా మహేశ్ బాబు షూట్‌కి వస్తానంటే.. ఆమె వల్ల సినిమా లేట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆమెను సినిమా నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల కోసం తెలుగు సినిమాని నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్ త్రివిక్రమ్‌పై కూడా పెదవివిరుస్తున్నారు. గురూజీ ప్రతి సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాల్సిన పనిలేదులే అంటూ సూచిస్తున్నారు. పూజా వల్లే షూట్ లేట్ అయ్యేలా ఉందని అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. మొత్తానికి మహేశ్ ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్దేపై పీకలదాకా కోపంగా ఉన్నారు.
#SSMB28 @urstrulyMahesh సినిమాకు డేట్లు అడ్జస్ట్ చేయలేక పోతున్న @hegdepooja .. షూట్ కొంచెం డిలే
— devipriya (@sairaaj44) December 5, 2022