సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేసింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తిసురేష్ నటించింది. అయితే.. తన పర్సనల్ విషయాలను సందర్భాలు బట్టి షేర్ చేస్తుంటాడు మహేష్.
ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు పీకాక్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోషూట్ కి సంబంధించి పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా పీకాక్ మ్యాగజైన్ ర్యాపిడ్ ఫైర్ లో మహేష్ బాబు తన పర్సనల్/ప్రొఫెషనల్ విషయాలను టకాటకా బయటపెట్టేశాడు. అయితే.. ఈ ర్యాపిడ్ ఫైర్ లో మహేష్ కి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో.. మీ నిక్ నేమ్స్ లో మీకు బాగా నచ్చేది? అనే ప్రశ్నకు.. ‘నాని’ అని చెప్పాడు.
మీరు ఎక్కువగా భయపడే విషయం? అనే ప్రశ్నకు.. ‘నా డైరెక్టర్స్ అంచనాలను అందుకోవాలనే భయం అనుకుంటా’. మీలో దాగియున్న సీక్రెట్ టాలెంట్ ఏమైనా ఉందా.. ఇంట్లో బయటపెట్టేది? అనే ప్రశ్నకు.. నేను ఇంట్లో చాలా ఫన్నీగా ఉంటాను. నాలోని ఫన్నీ పర్సన్ ని నా పిల్లలు, భార్య ఎక్కువగా చూస్తారు. మీరు లైఫ్ లో చేసిన పెద్ద సాహసం? న్యూజిలాండ్ లో బంగి జంప్.. మీరు రెగ్యులర్ గా వాడే పదం? బ్యూటిఫుల్.. మిమ్మల్ని బాగా ఏడిపించిన సినిమా? లయన్ కింగ్.. అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.