మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై – ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు.
మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు అనే విమర్శలు కూడా ఈయనపై ఉన్నాయి. చాలా సినిమాల్లో ఒకేలా ఉంటాడు ఈ సూపర్ స్టార్. పెద్దగా రిస్క్ తీసుకోడు. ఉన్న లుక్‌తోనే ముందుకు వెళ్తుంటాడు. మరీ విపరీతం అనిపించే ప్రయోగాల జోలికి వెళ్లడంలో మహేష్ వెనకే ఉంటాడు. అయితే రెండేళ్లుగా ఈయనలో మార్పు వచ్చింది.
మహర్షిలో గడ్డంతో కనిపించాడు. సరిలేరు నీకెవ్వరులో సైనికుడి గెటప్‌లో కనిపించాడు. ఇప్పుడు పరశురాం సర్కారు వారి పాట సినిమా కోసం మరోలా మారిపోతున్నాడు సూపర్ స్టార్. ఇక ఇలాంటి సీన్స్ చూస్తుంటే మహేష్ ను ఎందుకు సూపర్ స్టార్ అంటారో మనకు మరోసారి అర్థం అవుతుంది. మరోవైపు మహేష్ థమ్సప్ యాడ్ లో ఏకంగా టీనేజర్ లా కనిపిస్తూ షాకిస్తున్నారు.
ఆయన గౌతమ్ కృష్ణ కు అన్నయ్యా? అన్నంత యంగ్ గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఖాళీ చేసిన థమ్సప్ బాటిల్ ని చూపిస్తూ మహేష్ ఇచ్చిన ఫోజులు వైరల్ గా మారాయి. కెరీర్ ఆరంభం నుంచి మహేష్ ని థమ్సప్ కంపెనీ వదిలినట్టే లేదు.
మెగాస్టార్ చిరంజీవి చరణ్ లాంటి స్టార్లు థమ్సప్ కి కొన్నాళ్ల పాటు ప్రచారం చేసారు. ఇటీవల మహేష్ ఖాతాలోనే పర్మినెంట్ గా ఉంది ఈ బ్రాండ్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి మహేష్ థమ్సప్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.