మహేష్ బాబు గారాలపట్టి సితార ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలోనే కళావతి సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా తల్లిదండ్రులు గర్వపడే రీతిలో కూచిపూడి డ్యాన్స్ చేసి అభిమానుల్నీ అలరించింది. కూతురి టాలెంట్ ను చూసి మహేష్ బాబు, నమ్రతా మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సితార మరో సాహసం చేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.
ఇది కూడా చదవండి: నన్ను విమర్శించే హక్కు వాళ్ళకి ఎక్కడిది: ప్రియమణి
విషయం ఏంటంటే? స్విమ్మింగ్ పూల్ లో సితార కాసేపు ఊపిరి బిగబడుతున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో పాటు.. అండర్ వాటర్ లో ఊపిరి బిగబెట్టే కళ అంటే మాములుగా నిద్రపోవడమే. కానీ చాలా మెలకువతో కూడుకున్నది. జలగర్భంలో ఊపిరి బిగబెట్టడం చాలా కష్టం. కానీ అది మీ స్విమ్మింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది… అంటూ ఆ పిక్ కు క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. సితార తాజా సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.