సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వారు దిగిన చిన్నప్పటి ఫొటోలు అయితే నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫొటో వైరల్ అవుతోంది.
నటుల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వారి అభిమానులు కూడా తమ ఇష్టమైన నటీనటుల చిన్నప్పటి ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యంగ్ హీరో ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఉన్న ఆ చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ఆ బుడ్డోడు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో యువ హీరో అని తెలుసా! ఆ యంగ్ హీరో చేసింది తక్కువ మూవీస్ అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
అందం, అభినయం, నృత్యంతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించాడు ఆ యువ హీరో. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. విరామం అనంతరం ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు రోషన్. తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏది పడితే ఆ మూవీని ఒప్పుకోకుండా కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
రోషన్ త్వరలో తన తర్వాతి ప్రాజెక్టును ప్రకటించనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్‌తో ఆయన దిగిన ఒకప్పటి ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ ఫొటో మీద నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ పక్కన ఉన్న పిల్లాడు ఇప్పుడు బాగా మారిపోయాడని అంటున్నారు. ఆ చిన్న పిల్లాడు మారినా.. మహేష్ మాత్రం అంతగా మారలేదంటున్నారు. సూపర్ స్టార్ ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారని మెచ్చుకుంటున్నారు. మరి.. మహేష్‌తో రోషన్ దిగిన ఆ ఫొటో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.