ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా యాడ్స్ లో నటిస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. కొన్ని యాడ్స్ లో ఈ హీరోల కు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.. దాంతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగానే వస్తుంది. ముఖ్యంగా శీతల పానియాలకు సంబంధించి యాడ్స్ చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటుంటాయి. థమ్సప్ యాడ్ లో చాలా మంది హీరోలు తమ యాక్షన్ తో ఇరగదీశారు. గతంలో థమ్సప్ యాడ్‌లో నటించిన మహేశ్ బాబు ఇప్పుడు డ్యూ కూల్ డ్రింక్‌కు ప్రచారకర్తగా మారాడు.
తాజాగా ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బుర్జ్ ఖలీఫాపై నుంచి కింది వరకు బైక్‌పై వచ్చినట్లు ఈ యాడ్ హాలీవుడ్ రేంజ్‌లో దీన్ని రూపొందించారు. ‘అందరికీ భయం వేస్తుంది.. అందరికీ గొంతు ఎండిపోతుంది.. కానీ మీరు భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు’ అంటూ మహేష్ బాబు డైలాగ్ తో యాడ్ నడుస్తుంది.
ఇదే యాడ్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నటించాడు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ చూడా బాగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించి ఇద్దరు హీరోల యాక్షన్ సీక్వెన్స్ పై ఎవరు బెస్ట్ గా చేశారు అంటే ఎవరు బెస్ట్ అనేదానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.