ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది మనిషి జీవన విధానంలో ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు అభిమానులకు దగ్గరయ్యేందుకు ట్విట్టర్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సినీ స్టార్లు వ్యక్తిగత విషయాలతో పాటు వారి సినిమాలకు సంబంధించిన విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటారు. అయితే సోషల్ మీడియా ఫాలోయింగ్ పరంగా టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు.
మహేష్ ఎల్లప్పుడూ తన సినిమా విశేషాలను, వ్యక్తిగత అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటూ ఉంటాడు. రోజురోజుకి సూపర్ స్టార్ ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ మరో క్రేజీ రికార్డు నమోదు చేశాడు. తాజాగా మహేష్ చేసిన ట్వీట్ లక్ష లైక్స్ పొందింది. అయితే.. మహేష్ ట్వీట్లకు లక్ష లైక్స్ రావడం కొత్తేమి కాదు. రీసెంట్ గా లక్ష లైక్స్ పొందిన మహేష్ ట్వీట్స్ సంఖ్య 30కి చేరడం విశేషం.
Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ప్రస్తుతం మహేష్ 12 మిలియన్ల ట్విట్టర్ ఫాలోయింగ్ కలిగి టాప్ లో ఉన్నాడు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి సాధించిన ఈ ట్విట్టర్ రికార్డు పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.