మహేష్ బాబు. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. గత ఏడాది సర్కారు వారి పాటతో సందడి చేశారు. ప్రస్తుతం తివ్రికమ్ శ్రీనివాస్ సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబును కొంత మంది నెటిజన్లు ....
టాలీవుడ్ ష్టార్ హీరోల్లో ఒకరు మహేష్ బాబు. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. గత ఏడాది సర్కారు వారి పాటతో సందడి చేశారు. ప్రస్తుతం తివ్రికమ్ శ్రీనివాస్ సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తన తండ్రి కృష్ణ నుండి నట వారసత్వాన్ని తీసుకున్న ఆయన.. అంచనాలను మించి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తండ్రిలా కొత్త వారిని ప్రోత్సహిస్తుంటారు. జిఎంబీ పేరుతో నిర్మాణ సంస్థలోకి అడుగుపెట్టి.. పలు చిత్రాలను నిర్మించారు. 2020లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మేజర్ మూవీకి ఆయనే నిర్మాత. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందిరికీ తెలుసు. అయితే ఇప్పుడు మరోసారి ఓ చిన్న సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అయితే కొంత మంది నెటిజన్లు ఆయనను ర్యాగింగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల ప్రచారాలతో అందరి నోళ్లలో నానిన చిత్రం మేం ఫేమస్. ఈ సినిమాతో పాటు మళ్లీ పెళ్లి ఈ రోజు థియేటరల్లో సందడి చేశాయి. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మితమైంది. ఈ మూవీని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమాను ఇటీవల మహేష్ బాబు చూశారు. దీంతో ఈ సినిమా గురించి మెచ్చుకుంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘ఈ సినిమాను చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాలోని నటీనటులంతా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా డైరెక్టర్, రైటర్, హీరో సుమంత్ ప్రభాస్ టాలెండ్ సూపర్బ్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పాటు అన్ని క్రాఫ్టులు ఫర్ ఫెక్ట్ గా కుదిరాయి. కొత్త వాళ్లు ఈ సినిమాను నిర్మించారంటే నమ్మలేకపోతున్నా. నిర్మాతలకు అభినందనలు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అంతేకాకుండా సుమంత్ ప్రభాస్ తదుపరి చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై నిర్మించడం తనకు ఎంతో సంతోషం అంటూ మరో ట్వీట్ వేశాడు. దానికి సుమంత్ ప్రభాస్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. ఇంత వరకు ఓకే కానీ.. ఈ సినిమాను పొగిడి.. మరో సినిమా గురించి ప్రస్తావించడకపోవడంతో ఆయనను టీజ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అదే నరేష్, పవిత్రలు నటించిన మళ్లీ పెళ్లి. ఈ సినిమా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడంతో.. ఈ సినిమాపై ట్వీట్ చేయాలంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. ‘వెయిటింగ్ ఫర్ మళ్లీ పెళ్లి రివ్యూ అన్న.. ఇంకా అదే మిగిలి ఉంది మా దరిద్రానికి కానియ్‘ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇచ్చినా ఇస్తాడయ్యా అంటూ మరొకరు టీజ్ చేసేవిధంగా కామెంట్స్ పెట్టారు. నిజానికి మళ్లీ పెళ్లి సినిమాలో మహేష్ బాబు ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి ఆ సినిమాను కూడా ప్రత్యేకంగా వీక్షించి, ట్వీట్ వేయాలంటూ కామెడీ చేస్తున్నారు చాలామంది.
Waiting for #MalliPelli review anna … Inka Adhe migilidhi maa daridraniki … kaniyy
— NAGA SAI REDDY™ 🔥 (@alwaysNAGA) May 25, 2023