సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు గ్యాప్ లేకుండా సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ పరశురామ్ మీకు కథ చెప్పేటప్పుడు 5 నిమిషాల్లోనే ఓకే చేశారా? అనే ప్రశ్నకు స్పందించాడు. మహేష్ మాట్లాడుతూ.. “పరశురామ్ గారు కథను నేరేట్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆయన నేరేషన్ స్టార్ట్ చేసిన 10-15 నిమిషాల్లోనే క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయాను. పరశురామ్ టెర్రిఫిక్ రైటర్. క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడే నా మొహంలో నవ్వొచ్చేసింది” అంటూ దర్శకుడి గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి డైరెక్టర్ పరశురామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.