సూపర్ స్టార్ మహేష్ బాబు.. SSMB28 ఫస్ట్ లుక్ తో ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. అదే టైంలో ఆ లుక్ లో మహేష్ వేసుకున్న షర్ట్, ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. దీంతో దాని రేటు ఎంతో తెలుసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు.
సెలబ్రిటీలు ఏం చేసినా అది హాట్ టాపిక్. రెమ్యూనరేషన్ దగ్గర నుంచి వారు ధరించే దుస్తులు, చెప్పుల వరకు ప్రతి దాని కాస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ కూడా వాటి రేటు గురించి తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఆఖరికి ఒంటిపై ఏం వేసుకున్నా సరే అభిమానులకు వాటి గురించి ఇట్టే తెలిసిపోతుంది. టాప్ హీరోల సినిమాలోని మ్యానరిజమ్స్ ని మాత్రమే కాదు సదరు హీరోలు వేసుకున్న షర్ట్, ప్యాంట్, షూస్ లాంటి వాటిని బాగా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. దీని ధర తెలిస్తే అందరూ అవాక్కయిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు పెట్టుకున్న వాచెస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. ఎందుకంటే అవి ఒక్కోటి కోట్లు విలువైనవి కాబట్టి. ఈ క్రమంలోనే ఆయా హీరోల ఫ్యాన్స్ సదరు వాచీల ఖరీదు చూసి నోళ్లు వెళ్లబెట్టేశారు. తాజాగా సూపర్ స్టార్ తన కొత్త సినిమాలో వేసుకున్న షర్ట్ ధర చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం.. అది నార్మల్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంది. కాస్త డబ్బులు పెడితే సేమ్ అలాంటి షర్ట్ ని మీరు కూడా కొనేయొచ్చు. మరి ఆ షర్ట్ కాస్ట్ ఎంత? ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ‘SSMB 28’. తాజాగా మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో స్టయిల్ గా సిగరెట్ తాగుతున్న మహేష్ లుక్ వావ్ అనిపించింది. అదే టైంలో మహేష్ షర్ట్ కూడా పలువురిని ఎట్రాక్ట్ చేసింది. దీంతో దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించగా.. ఆ వివరాలు బయటపడ్డాయి. సూపర్ డ్రై కంపెనీకి చెందిన ‘వింటేజ్ చెక్ ఫ్లానెల్ షర్ట్‘ ఇది. దీని ధర కేవలం రూ. 3,299 మాత్రమే. ప్రస్తుతం ఇది AJIOలో అందుబాటులో ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన చాలామంది ఫ్యాన్స్ వెంటనే బుక్ చేసేద్దామని ఫిక్సయిపోతున్నారు. మరి మహేష్ షర్ట్ కాస్ట్ తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్ చేయండి.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023