సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈయన నటన గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ నటనా వారసత్వాన్నే కాదు.. దయాగుణాన్ని కూడా మహేశ్ బాబు పునికిపుచ్చుకున్నాడు అంటారు. ఆ మాటలకు తగ్గట్లుగానే మహేశ్ నటన, సాటి మనుషులకు సాయం చేయడం ఉంటూ ఉంటాయి. మహేశ్ బాబు కూడా ఇప్పుడిప్పుడే తండ్రిలేని లోటు నుంచి తన దృష్టిని సినిమాల మీదకు మళ్లిస్తున్నారు. త్రివిక్రమ్ దర్వకత్వంలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28 షూట్ మొదలు పెట్టేసినట్లు చెబుతున్నారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు.. అలాగే వస్తున్నారు కూడా. ఇప్పటికే రాబోయే తరం వారసులు కూడా సినిమాల కోసం సిద్ధమవుతున్నారు.
అయితే మహేశ్ కుటుంబం నుంచి ఆయన కుమారుడు గౌతమ్ కూడా నటుడు కావాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. అయితే గౌతమ్ సినిమాల ఎంట్రీపై ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే గౌతమ్‌కు నటనపై ఆసక్తి ఉంది అనే విషయం మాత్రం పరోక్షంగా బయటపడింది. స్కూల్‌లో గౌతమ్ తన మిత్రులతో కలిసి ఒక యాక్ట్ చేసి చూపించాడు. అది ఇంగ్లీష్ సినిమా అయిన ఫ్రోజెన్ యాక్ట్ లా అనిపించింది. గౌతమ్.. తన మిత్రులతో కలిసి ఎంతో చక్కగా ఆ నటకాన్ని ప్రదర్శించారు. ఆ విషయాన్ని, అందుకు సంబంధించిన చిన్న వీడియో, కొన్ని ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
ఆ వీడియో షేర్ చేస్తూ నమ్రత ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పెట్టారు. “అతను లవ్ ఎక్స్‌పర్ట్ కాదు.. కానీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంతో చక్కగా నటించారు. ఘట్టమనేని గౌతమ్ తొలి థియేటర్ ప్రొడక్షన్. దానిని గౌతమ్ తన స్టైల్‌లో పూర్తి చేశాడు. ఫ్రోజన్ అనేది మా ఫ్యామిలీ ఫేవరెట్ అనేమీ కాదు.. కానీ, గౌతమ్‌ని ఇలా చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా గౌతమ్ నుంచి మరెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నాం. లవ్ యూ సో మచ్ గౌతమ్” అంటూ నమ్రత రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. గౌతమ్‌ని చూస్తే అచ్చూ మహేశ్ బాబుని చూస్తున్నట్లే ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని నటుడిగా చూడటం.