సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు గ్యాప్ లేకుండా సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా మహేష్ బాబు, కమెడియన్ బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సర్కారు వారి సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న మహేష్.. సత్తి మాటతీరుకు ఫిదా అయిపోయి నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చివరలో సత్తిపై.. “నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా..?” అంటూ గట్టిగా అడిగాడు మహేష్.
బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. సర్కారు వారి పాట సెకండాఫ్ అంతా వైజాగ్ చేపల మార్కెట్ లో ఉంటుందంట కదా.. అన్నాడు. వెంటనే మహేష్ అందుకొని.. “నీ ఇష్టం.. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావ్.. ఏది నోటికొస్తే అది..” అని చివరలో నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం సత్తిపై మహేష్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్, జీఎంబి ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మరి ఈ వీడియో చూసి మహేష్ – సత్తిల సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.