సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుస విజయాల నేపథ్యంలో మహేష్ బాబు నటిస్తున్నచిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే.. ఈ చిత్రం షూటింగ్ మొదలైనపుడు కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు ఎదరుయ్యాయి. కానీ.., అలాంటి ఎన్నో ఇబ్బందులను దాటుకుని “సర్కారు వారి పాట” విడుదలకి సిద్ధమవుతోంది.
ఇక త్వరలో ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాంగ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. అయితే.. ఇంతలోనే “సర్కారు వారి పాట” మూవీకి లీకుల బెడద పట్టుకుంది.
ఇది చదవండి: వినూత్న రీతిలో రాధేశ్యామ్ ప్రమోషన్స్..!
ఈ మధ్య చిత్ర షూటింగ్ సమయంలో కొంత మంది లీక్ రాయుళ్లు రికార్డు చేసి.., మేకింగ్ వీడియోలను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “సర్కారు వారి పాట’ మూవీ సాంగ్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాంగ్ అఫీషయల్ గా రిలీజ్ కాకముందే ఇలా లీక్ అయ్యి.. నెట్టింట వైరల్ కావడంతో మహేశ్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరి.. స్టార్ హీరోల సినిమాలకి సైతం ఈ లీక్ కష్టాలు ఎదురు అవువుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.