ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా అభిమానులు సూపర్ స్టార్ మహేశ్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మూడ్ లో ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. మహేశ్ లుక్స్, స్లాంగ్, డైలాగ్స్, స్వాగ్ అన్నీ ఎంతో కొత్తగా ఉన్నాయి. వింటేజ్ మహేశ్ ను గుర్తుచేశారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఎస్పీపీ మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకాచకా జరిగిపోతున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనే విషయం చెప్పేశారు.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట మూవీ టైమ్ లో మహేశ్ తో గొడవపై పరశురామ్ క్లారిటీ!
సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7న నిర్వహించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ముక్య అతిథిగా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్లు టాక్ అయితే వినిపించింది. అది ఎంత వరకు నిజం అనే దానిపై క్లారిటీ లేదు. ట్రైలర్ తర్వాత సినిమా వచ్చిన హైప్ అందరూ చూశారు. తప్పకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరవుతారనే అనుమానంతోనే పోలీసు గ్రౌండ్స్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్య అతిథి ఎవరనేది తెలిస్తే హాజరయ్యే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
It’s time for celebrations🤘
All the Super⭐ fans assemble at the police grounds on May 7th for the Grand #SVPPreReleaseEvent 💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamatelugu pic.twitter.com/XAvKL0jkUJ
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2022
అంతేకాకుండా సర్కారువారి పాట సినిమా సోషల్ మీడియాలో మరో ఘనత సాధించింది. అదేంటంటే.. ‘హ్యాష్ మోజీ’ అనమాట. అంటే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ తెలుసు కదా.. #SarkaruVaariPaata అని టైప్ చేస్తే చివర మహేశ్ బాబు ఏమోజీ వస్తుంది. అది రావడం అంత తేలికేం కాదు. సినిమాకి మంచి హైప్ ఉండాలి.. భారీ అంచనాలు నెలకొని ఉండటమే కాకుండా, దర్శకనిర్మాతలు కూడా బాగా డబ్బు పెట్టాలి. గతంలో ఈ ఏమోజీ సాహో సినిమాకి చూశాం. ఇటీవల కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాకి కూడా హ్యాష్ మోజీ రావడం చూశాం. ఇప్పుడు ఆ హ్యాష్ మోజీ సర్కారువారి పాట సినిమాకి కూడా వచ్చింది. ఈ హ్యాష్ మోజీని ట్రై చేస్తున్నా అంటూ మహేశ్ బాబు స్వయంగా ట్వీట్ చేశాడు. సర్కారు వారి పాట సినిమా కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Just trying out this new emoji 😉#SarkaruVaariPaata#SVP#SVPMania
— Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2022