తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది రెండే పేర్లు.. ఒకటి మహేశ్ బాబు, రెండు సర్కారు వారి పాట సినిమా పేరు. తెలుగు సినిమా అభిమానులు, మహేశ్ ఫ్యాన్స్ అంతా సర్కారు వారి పాట సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ మహేశ్ లుక్స్, స్లాంగ్ చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ జోరుతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వార్తలు వింటుంటే సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ప్రాంతం, భాషల వారీగా సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం.
నైజాం – 36 కోట్లు
సీడెడ్ – 13 కోట్లు
ఉత్తరాంధ్ర – 12.50 కోట్లు
ఈస్ట్ – 8.50 కోట్లు
వెస్ట్ – 7 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 7.50 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు
ఏపీ + తెలంగాణ టోటల్ – 96.50 కోట్లు
కర్ణాటక – 8.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 3 కోట్లు
ఓవర్సీస్ – 11 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 120 కోట్లు
సర్కారు వారి పాట సినిమాకి మొత్తం 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మొత్తం 121 కోట్లు దాకా కలెక్ట్ చేయాలి. సినిమా మీద ఉన్న అంచనాలను బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద విషయం కాదనే చెప్పాలి. కాకపోతే ఎంత త్వరగా సాధిస్తుంది అనేదే మ్యాటర్. సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ పోకిరి టైమ్ లుక్స్, ఆ ఫ్లేవర్ ఉండటంతో ఫ్యాన్స్ అంతా వింటేజ్ మహేశ్ బాబుని చూడబోతున్నాం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కారు వారి పాట సినిమా కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.