‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్నారంటే ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ ఎనర్జీ చూసాక, పోకిరి రోజులను గుర్తుచేశాయని మహేష్ కూడా చెప్పడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. దానికి తగ్గట్టే మొదటి షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది సర్కారు వారి పాట. అందులోనూ మహేష్ సరసన కీర్తి సురేష్.. తమన్ సంగీతం.. ఇలా సర్కారు వారి పాటకు అన్నీ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: Lala Bheemla: మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ పాట!
భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూస్తే.. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36.63 కోట్ల వసూలైనట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Best Dialogues: ‘సర్కారు వారి పాట’ మూవీలోని బెస్ట్ డైలాగ్స్!తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్..
నైజాం- 12.24 కోట్ల రూపాయలు
సీడెడ్- 4.7 కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర- 3.73 కోట్ల రూపాయలు
ఈస్ట్- 3.25 కోట్ల రూపాయలు
వెస్ట్- 2.74 కోట్ల రూపాయలు
గుంటూరు- 5.83 కోట్ల రూపాయలు
క్రిష్ణ- 2.58 కోట్ల రూపాయలు
నెల్లూరు- 1.56 కోట్ల రూపాయలు
ఏపీ, తెలంగాణలో కలిపి మొదటి రోజు షేర్: 36.63 కోట్ల రూపాయలు.
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.