ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. పైగా మహేష్ బాబుతో తాను ఎలాంటి సినిమా తీయనున్నాడో చెప్పేసరికి ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ బరిలో నిలిపేందుకు తన శాయశక్తులా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మొత్తానికి ‘నాటు నాటు’ సాంగ్ తో గ్లోబల్ రికగ్నిషన్ అయితే ఆర్ఆర్ఆర్ టీమ్ కి దక్కింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. పైగా మహేష్ బాబుతో తాను ఎలాంటి సినిమా తీయనున్నాడో చెప్పేసరికి ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయారు. అయితే.. అనౌన్స్ మెంట్ వరకు బాగానే ఉందికాని.. సినిమా స్టోరీ లైన్ గురించి కొన్ని సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలో మహేష్ బాబు ఓవైపు దర్శకుడు త్రివిక్రమ్ తో ‘SSMB28’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని ఇదే ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమా అయ్యేలోపు దర్శకుడు రాజమౌళి.. మహేష్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేస్తాడని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా గురించి కొత్త చర్చలు మొదలయ్యాయి. మహేష్ తో ‘గ్లోబ్ ట్రోటరింగ్’ జానర్ లో మూవీ ఉండబోతుందని చెప్పాడు రాజమౌళి. మరోవైపు మహేష్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో సిరీస్ లుగా రానుందని అంచనాలు పెంచేశాడు రచయిత విజయేంద్రప్రసాద్. దీంతో ఫ్యాన్స్ అంతా మహేష్ ని హీరోగా వరల్డ్ మొత్తం చూడబోతుందని ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఇదిలా ఉండగా.. మహేష్, రాజమౌళిల సినిమాకు సంబంధించి జానర్ అయితే అనౌన్స్ చేశారు. కానీ.. ఇంతవరకు స్టోరీ లైన్ ఫైనల్ కాలేదా? అనే విషయంపై కథనాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆల్రెడీ రాజమౌళి మహేష్ కథపై శ్రద్ధ పెట్టినప్పటికీ.. ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో రాజమౌళికి ఓ విజన్ ఉంది. కాబట్టి.. ఈ ఏడాది పూర్తయ్యేలోపు స్క్రిప్ట్ కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది నుండి షూటింగ్ మొదలు పెట్టనున్నారట రాజమౌళి టీమ్. సో.. చూడాలి మరి త్వరలోనే ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో! మరి మహేష్ – రాజమౌళి సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.