రేంజ్ రోవర్ ఈ కార్లు చాలా వరకు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారులు ఎక్కువగా మెయింటేన్ చేస్తుంటారు. ఇది అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతికొద్ది మంది మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక వెండితెరపై ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలకు ఖరీదైన వాహనాలు కొనడం అలవాటు. ఈ క్రమంలో మహేష్ బాబు ఓ కాస్ట్ లీ కారు కొనుగోలు చేశారు.. ఈ కారు హైదరాబాద్ లో ఎవరికీ లేకపోవడం మరో ప్రత్యేకత. వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుల్లో మహేష్ బాబు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే పలు యాడ్స్ లో నటిస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ సంపన్నమైన స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీల తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. తన సహనటి నమ్రత శిరోద్కర్ ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. బాబు గౌతమ్ కృష్ణ, కూతురు సితార. ఇక షూటింగ్ సమయంలో ఏమాత్రం గ్యాప్ వచ్చిన తన కుటుంబంతో జాలీగా గడుపుతుంటారు మహేష్ బాబు. ప్రతి సంవత్సరం ఒకటీ రెండు సార్లు ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లి వస్తుంటారు.
రేంజ్ రోవర్.. ఇది భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. చాలా వరకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు మాత్రమే ఎక్కువగా మెయింటేన్ చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ కార్లు చిరంజీవి, జూ. ఎన్టీఆర్, ప్రభాస్ మరికొంతమంది టాప్ హీరోలు మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా హీరో మహేష్ బాబు రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.5.4 కోట్ల అని ప్రచారం జరుగుతుంది. రేంజ్ రోవర్ ఎస్ వి.. ఇది పూర్తిగా గోల్డెన్ కలర్ లో ఉన్న కారు. ప్రస్తుతం మహేష్ బాబు గ్యారేజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ కారు ని కొన్న ఏకైక వ్యక్తి మహేష్ బాబు అని తెలుస్తుంది. ఈ కారును హైదరాబాద్ రోడ్లపై తిప్పినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.