తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సూపర్ స్టార్ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఆయనను పర్యాయపదంగా చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. సాహిత్య, సంగీత విభాగానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఒక గొప్ప టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోయామని తెలిపారు. శాస్త్రిగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.